తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

  • ఫీజు గడువును మే 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం
  • ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం
  • ఆలస్య రుసుము రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ఫీజు గడువును ఈ నెల 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులు ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఫీజును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే లేట్ ఫీజును రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు రెండు సెషన్‌లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. మే 22 నుంచి 25వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

Telangana State Board of Intermediate Education
TSBIE
Telangana Inter Supplementary Exams

More Telugu News